కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని కాచిగూడలో (Kachiguda) దారుణం జరిగింది. సుందర్ నగర్ లోని ఓ ఇంట్లో ఏసీలో సడెన్ గా మంటలు చెలరేగాయి (Fire Accident). ఈ మంటల్లో మూడేళ్ల చిన్నారులు చనిపోయారు. కాచిగూడలోని సుందర్ నగర్ లోని ఇంట్లో ఏసీలో మంటలు చెలరేగాయి. బెడ్ పై పడుకున్న మూడేళ్ల చిన్నారులు రహీం, రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో రెహమాన్ అక్కడికక్కడే చనిపోగా.. మరో బాలుడు రహీంను స్థానికులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ రహీం కూడా చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read Also: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం: అంబులెన్స్-కారు ఢీకొని ఇద్దరి మృతి
Follow Us On: Pinterest


