కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లోని లోయర్ మానేరు డ్యామ్ (LMD) రైతులకు నీటి పారుదల శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు ఈనెల 31వ తేది నుంచి వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు ఎల్ఎండీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రమేశ్ తెలిపారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీన జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈనెల 31 ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుండి కాకతీయ కాలువల ద్వారా యాసంగి పంటకు సాగు నీటి విడుదల ప్రారంభమవుతుందని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు(LMD) పరిధిలోని ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో జోన్-1 పరిధిలో 146 కిలో మీటర్ నుంచి 284 కిలో మీటర్ల వరకు 7రోజులు, జోన్-2 పరిధిలో 284.09 కిలో మీటర్ నుంచి 340 కిలో మీటర్ వరకు 8 రోజులు సాగు నీరు విడుదల చేస్తారు. సాగునీటిని వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు.
Read Also: ఉద్యోగాల పేరుతో దోచేస్తున్న కి”లేడీ”
Follow Us On: Sharechat


