కలం, వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) వేల జీరో డ్రగ్స్ లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar). న్యూ ఇయర్ వేడుకల వేల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు ఉన్నతాధికారులతో సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీరో డ్రగ్స్ లక్ష్యంగా హైదరాబాద్ లో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పబ్ లు, హోటళ్లు రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీపీ సజ్జనార్ తేల్చి చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ప్రధాన కూడళ్లు, పబ్ లు, రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలు, అపార్టుమెంట్లలో జరిగే వేడుకలపై గట్టి నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించారు సజ్జనార్ .
సిటీలోకి కొత్తగా వచ్చే వ్యక్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. రాత్రి 1 గంటలోపే పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని.. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. జన సమూహం ఎక్కువగా ఉండే మైత్రీవనం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్ తో పాటు పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, బ్యారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా నగరమంతా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సజ్జనార్(CP Sajjanar).
Read Also: హైదరాబాద్లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు
Follow Us On: Youtube


