కలం, వెబ్‌డెస్క్: తాను త్వరలోనే బీజేపీలో చేరతానని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)పేర్కొన్నారు. రాజాసింగ్ కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించడంపై ఆయన బహిరంగ విమర్శలు చేశారు. అంతకుముందు కూడా పలుమార్లు బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచంద్రరావు బీజేపీ (BJP) అధ్యక్షుడయ్యాక రాజాసింగ్ బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన హిందుత్వ ఎజెండాగా రాజకీయాలు చేస్తుంటారు. బీజేపీ మినహా మరే రాజకీయపార్టీలోనూ ఆయన ఇమడలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
అయితే కొన్నిరోజులుగా రాజాసింగ్ (Raja Singh) బీజేపీకి తిరిగివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీజేపీలో చేరతానని ప్రకటించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)తో రాజాసింగ్ కు విబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తుంటాయి. మరి గతంలో సొంతపార్టీ మీదే బహిరంగ విమర్శలు చేసిన రాజాసింగ్‌ను మరోసారి పార్టీలోకి తీసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాలి.
Read Also: సోషల్ మీడియా బ్యాన్పై మద్రాస్ హైకోర్ట్ సంచలన ప్రకటన
Follow Us On: Youtube


