కలం, వెబ్ డెస్క్ : హాలీవుడ్ హీరోలైన సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడే బలవంతుడన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘మన దేశంలో నాలెడ్జ్ కు కొదవ లేదు. మన పురాణాల్లో ఉన్న హీరోలే హాలీవుడ్ హీరోల కన్నా పవర్ ఫుల్ అని మన పిల్లలకు చెప్పాలి. బ్యాట్ మెన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడు. రాముడికి మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరు. అవతార్ సినిమా కంటే మన పురాణాలైన మహాభారతం, రామాయణం చాలా గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది’ అంటూ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.
కృష్ణుడు, మహాశివుడి గొప్పతనం గురించి కూడా పిల్లలకు సీఎం చంద్రబాబు (Chandrababu) చెప్పాలన్నారు. బకాసురుడు, కంస మామ లాంటి రాక్షసుల గురించి మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. అలా చెప్పినప్పుడే పిల్లలకు మంచి, చెడుల గురించి అవగాహన వస్తుందన్నారు. ‘మానసిక ఒత్తిడిలను యోగా అద్భుతంగా తగ్గిస్తుంది. జీరోను మనమే కనిపెట్టాం. ఇండియన్ ఫ్యామిలీ కల్చర్ ప్రపంచంలో ఎక్కాడా లేదు. ఈ ఫ్యామిలీ కల్చర్ బాధ్యతలతో పాటు భద్రతను ఇస్తుంది. రాబోయే రోజుల్లో కుటుంబానికి ముగ్గురు పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకోవాలి’ అన్నారు చంద్రబాబు నాయుడు.
Read Also: త్వరలో బీజేపీలో చేరుతా: రాజాసింగ్
Follow Us On : WhatsApp


