కలం వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్(Akhil Akkineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్(Lenin Movie). ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. డివోషనల్ టచ్‌తో.. విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ లెనిన్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు కానీ.. ఆతర్వాత ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్(Sithara Entertainments) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ సినిమా గురించి ఊహించని విధంగా అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ.. అప్‌డేట్ ఇచ్చింది ఎవరు..? లెనిన్ వచ్చేది ఎప్పుడు..?
యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఏ ఇంటర్ వ్యూ ఇచ్చినా అందులో నెక్ట్స్ సితార సంస్థ నుంచి రాబోయే సినిమాలకు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్స్ ఇస్తుంటారు. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఆయన లెనిన్ సినిమా గురించి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో లెనిన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని.. మార్చిలో ఈ మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇది అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇందులో అఖిల్ కు జంటగా ముందుగా శ్రీలీలను తీసుకున్నారు. అయితే.. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ బోర్సే ని తీసుకున్నారు. అఖిల్, శ్రీలీల పై చిత్రీకరించిన సీన్స్ ను ఇటీవల రీషూట్ చేశారు.
ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. చాలా కథలు విని ఫైనల్ గా లెనిన్ కథకు ఓకే చెప్పాడు. ఇందులో అఖిల్ చాలా కొత్తగా.. చాలా నేచురల్ గా కనిపిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏజెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో అభిమానులే కాదు.. అఖిల్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే మార్చిలో ఎప్పుడు రిలీజ్ చేసేది డేట్ కూడా ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. లెనిన్ అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో చూడాలి.
Read Also: నాగ్ 100వ సినిమా.. తెర వెనుక ఏం జరుగుతోంది..?
Follow Us On: Instagram


