యాదాద్రిలో భక్తజన సందడి!

కలం, యాదగిరిగుట్ట: ఆదివారం సెలవు దినం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (Yadadri Temple) లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లలో బారులు తీరారు.సర్వ దర్శనం క్యూ కాంప్లెక్స్ లో బారులు దిరిన భక్తజనం రద్దీ దృష్ట్యా ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, ఘాట్ రోడ్డు పరిసరాలు కిటకిటలాడాయి.

ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించి, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకుని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు.

Read Also: రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>