బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు వర్ష సూచన

కలం, వెబ్​ డెస్క్​ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం (Weather Alert) ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.

రేపు పారాదీప్​ సాగర్​ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

ఉరుములు, పిడుగుల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తీరం వెంట గంటకు దాదాపు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో తీరప్రాంత ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

Read Also: బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>