కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మచిలీపట్నంలో (Machilipatnam) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దివంగత నేత వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ, కూటమి ఒకే రోజు ర్యాలీలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే కూటమి నేతల ర్యాలీలకు మాత్రం అనుమతి ఇచ్చి వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఒకేసారి వైసీపీ, కూటమి నేతలు ర్యాలీ నిర్వహించే పరిస్థితి ఉండటంతో పోలీసులు వైసీపీ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. తాము ర్యాలీ నిర్వహించి తీరుతామని.. కూటమి నేతలు వెళ్లే రోడ్డులో కాకుండా మరో రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మాత్రం ఇందుకు అనుమతి ఇవ్వలేదు. మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని అనేక ప్రాంతాల్లో రంగా వర్దంతి నిర్వహించారు.
Read Also: నా చాయిస్ జైస్వాల్: మాజీ సెలక్టర్
Follow Us On: Youtube


