కలం, వెబ్ డెస్క్: భారత్ మాజీ సెలక్టర్ దిలప్ వెంగ్‌సర్కర్ (Dilip Vengsarkar) టీమిండియా జట్టు ఎంపికకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తానయితే గిల్ ప్లేస్‌లోకి యశస్వి జైస్వాల్‌ను (Yashasvi Jaiswal) తీసుకుని ఉండేవాడినని చెప్పారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ఆడనున్న టీమిండియా జట్టు ఎంపికకు సంబంధించిన చర్చ జరుగుతోంది. సీనియర్ ప్లేయర్లంతా కూడా ఈ జట్టు సెలక్షన్‌పైనే మాట్లాడుతున్నారు. కొందరు గిల్ తప్పించడంపై మాట్లాడితే, మరికొందరు గిల్ రీప్లేస్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారు. దీంతో టీమిండియా జట్టు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. తాజాగా ఇదే విషయంపై భారత్ మాజీ సెలక్టర్ దిలప్ వెంగ్‌సర్కర్ స్పందించారు. తానయితే గిల్ ప్లేస్‌లోకి యశస్వి జైస్వాల్‌ను తీసుకుని ఉండేవాడినని చెప్పారు. 2026 టీ20 ప్రపంచకప్ (T20 WC) జట్టులో యశస్వీ జైస్వాల్‌కు అవకాశం రాకపోవడంపై వెంగ్‌సర్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ వరుసగా అవకాశాలు దక్కకపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
శుభ్‌మన్ గిల్‌ను(Shubman Gill) తప్పించినప్పటికీ, జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరమని వెంగ్‌సర్కర్ (Dilip Vengsarkar) అభిప్రాయపడ్డారు. “జైస్వాల్ తనను తాను ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. మ్యాచ్ విన్నర్‌ను ఇలాగే పక్కన పెట్టడం సరైంది కాదు,” అని వెంగ్‌సర్కర్ వ్యాఖ్యానించారు.
‘‘23 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో జైస్వాల్ సగటు 36.15, స్ట్రైక్ రేట్ 164.31 ఉండటం అతని స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. 2024 ప్రపంచకప్ విజేత జట్టులో భాగమైనప్పటికీ ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా అతనికి రాలేదు’’ అని వెంగ్‌సర్కర్ అన్నారు.
Read Also: 32 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన విజ్ఞేష్ పుతుర్
Follow Us On: Youtube


