కేంద్ర మంత్రి రాజీనామా.. అదే కారణం!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ (Ravneet Singh Bittu) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని సూచనల మేరకు రాష్ట్రపతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

రాజ్యసభ పదవి ముగియడంతోనే..

పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న రవనీత్ సింగ్ బిట్టూ.. 2024 నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఇటీవలే ఆయన రాజ్యసభ పదవి కాలం పూర్తి కాగా, మరోసారి ఎన్నికవలేదు. దీంతో, నిబంధనల ప్రకారం ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం, రవనీత్ సింగ్ రాజీనామా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>