విద్యార్థుల ఉద్యమానికి పూర్తి మద్దతు: మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు నిర్వహిస్తున్న శాంతియుత నిరసనకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థులు నిరసనల్లో పాల్గొనవద్దంటూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం యాజమాన్యం అడ్వైజరీ జారీ చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..

నీట్ పేపర్ లీకేజీ కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కేసులు ఎత్తివేయాలి..

పేపర్ లీకేజీతో తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి, నీట్ పేపర్ లీకేజీ బాధితులకు న్యాయం చేయాలని మంత్రి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>