కలం, నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం (Basara Temple) లో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న వ్యాస పూర్ణిమ ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ అధికారులు శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Janaki Sharmila) ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఆలయ ఈఓ అంజనీ దేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ఉప ప్రధానాచార్యులు శ్రీపాద్ దీక్షితులు ఎస్పీకి వ్యాస పూర్ణిమ ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం పండితులు వేదాశీర్వచనాలతో ఆశీర్వదించి, వ్యాస పూర్ణిమ ఉత్సవాల ఆధ్యాత్మిక, వైదిక విశిష్టతను వివరించారు. ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని వారు ఎస్పీని కోరారు. వ్యాస పూర్ణమి ఉత్సవాలకు పోలీస్ శాఖ తరపున ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

