కలం, నిర్మల్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ను డీసీసీ ఉపాధ్యక్షుడు మమ్మాయి రమేష్ (Mammai Ramesh) ఖండించారు. బాసర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పకడ్బందీ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

