కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాబ్ జిల్లా అటవీ శాఖ అధికారిగా ప్రశాంత్ బాజీరావు పాటిల్ (Prashant Bajirao Patil) బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు పని చేసిన సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఇటీవల బదిలీపై వెళ్లగా.. ఆయన స్థానంలో ఆదిలాబాద్ నుంచి బాజీరావు పాటిల్ నిజామాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీవోలు సుధాకర్, చంద్రశేఖర్, ఎస్ఆర్వోలు సంజయ్, రవి మోహన్ భట్, పుండలిక్, వనిత, నర్సింగ్ రావు, సిబ్బంది నూతన డీఎఫ్‌వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఎఫ్‌వో తన చాంబర్‌లో రేంజ్ అధికారులతో గంటపాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
Read Also: ఏ ఉద్యోగానికైనా.. ఇక్కడ ఫ్రీ కోచింగ్!
Follow Us On : WhatsApp

