కలం, వెబ్ డెస్క్: ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది అర్థవంతమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. డెడ్‌లైన్స్, టార్గెట్స్ అంటూ ఆనందకరమైన క్షణాలను మిస్ అవుతున్నారు. ‘మా జీవితం ఇంతే‘ అంటూ రోజులు గడిపేస్తున్నారు. కానీ అతి కొద్దిమంది మాత్రమే జీవితంలో అసలైన మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. పిల్లలు, టూర్లు, ఆరోగ్యవంతమైన అలవాట్లతో ముందుకు సాగుతున్నారు. అలాంటివారిలో ఈ బెంగళూరు జంట (Bengaluru Couple) ముందుంటుంది.
ఖరీదైన జీవితం కంటే ప్రశాంతమైన జీవన విధానానికే ప్రాధాన్యం ఇస్తోంది ఈ జంట (Bengaluru Couple). లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులపై అధికంగా ఖర్చు చేయడం లేదు. దీనికి బదులుగా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, అవసరమైన వాటికే ఖర్చులు పెడుతున్నారు. ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక భద్రత ప్రాధాన్యమిస్తున్నారు. కుటుంబంతో గడిపే క్షణాలను అసలైన సంపదగా భావిస్తున్నారు. ఈ జంట ఆలోచన నేటి యువతకు కొత్త దిశ చూపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట చెప్పిన సూత్రాలు నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి మరి.
-ఆర్థిక స్వేచ్ఛనే అసలైన ఆనందం
-బెంగళూరు జంట వీడియో వైరల్
-ఆర్భాటాలు వద్దంటూ హితవు#FinancialPlanning #Bengaluru #YouthInspiration #SuccessMindset #Inspiration #MoneyManagement #SimpleLiving #Kalam #KalamDaily #KalamPaper pic.twitter.com/blu55dkcoP— Kalam Daily (@kalamtelugu) July 24, 2026
Read Also: ఏ ఉద్యోగానికైనా.. ఇక్కడ ఫ్రీ కోచింగ్!
Follow Us On: X(Twitter)

