తెలంగాణలో తొలి రోబో టీచర్.. ప్రత్యేకత ఇదే

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా యువతకు, విద్యార్థులకు ప్రయోజనం చేకూరే సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు అరుదైన బహుమతి లభించింది. తెలంగాణలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ పాఠశాలకు ఏఐ (AI) సాంకేతికతతో పనిచేసే హ్యూమనాయిడ్ రోబో టీచర్‌ను (Robot Teacher) బహుమతిగా అందించారు.

ఈ అత్యాధునిక రోబో టీచర్ (Robot Teacher) పాఠశాల విద్యార్థులకు వివిధ విషయాల్లో పాఠాలు చెప్పడంతో పాటు, వారు అడిగే సందేహాలు, ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్, ఏఐ సాంకేతికతను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ రోబోను అందుబాటులోకి తీసుకువచ్చారు. పాఠాలు చెప్తున్న రోబోను చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ రోబో టీచర్ విద్యార్థులతో సంభాషిస్తున్న వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Read Also: నీట్ లీక్‌పై సుప్రీం సీరియస్: కేంద్రం, ఎన్‌టీఏలకు నోటీసులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>