గీతం యూనివర్సిటీ బీటెక్ విద్యార్థిని అదృశ్యం

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో విద్యార్థిని అదృశ్యమైన (GITAM Student Missing) సంఘటన కలకలం రేపింది. యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆశ్రిత (19) అనే విద్యార్థిని నిన్నటి నుండి కనిపించకుండా పోయింది. నిన్న ఆశ్రిత తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

అనుమానంతో క్యాంపస్ హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులు అక్కడ సిబ్బందిని విచారించారు. విద్యార్థిని ఔటింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదని హాస్టల్ సిబ్బంది వారికి వెల్లడించారు. కూతురు ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>