కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర

కలం, చండూరు: కల్లు గీత కార్మికుల (Toddy Workers) రక్షణ, ఉపాధి, సంక్షేమం, ఆధునీకరణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆగస్టు రెండో తేదీన మొదలవుతుందని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న అన్నారు. 18 వరకు బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయాలని..

గురువారం చండూరు మండల కేంద్రంలో అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ.. బస్సు యాత్ర ఆగస్టు 6న నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని తెలిపారు.

జిల్లాలో కార్మికులు దాదాపు 25 వేల కల్లుగీత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షల ప్రమాద పరిహారం, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

అమరులను తల్చుకుంటూ యాత్ర..

కామ్రేడ్ ధర్మ భిక్షం, తోట్ల మల్సూరు, బైరు మల్లయ్య, వర్ధల్లి బుచ్చి రాములు, వేముల నాగయ్య, బాధిని చెన్నయ్య, జినుకుంట్ల లింగయ్య, బొమ్మగాని జానయ్య, కొండ నాగులు, కొండ రాములమ్ వంటివారిని గుర్తు చేసుకుంటూ యాత్ర కొనసాగుతుందని కొండ వెంకన్న తెలిపారు. ఈ నెల 6న నల్లగొండ టీఎన్జీవో భవన్‌లో ఉదయం 11 గంటలకు సభ ఉంటుందన్నారు. కల్లు గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు తాంధారి యాదయ్య, మొగుదాల వెంకటేశం, సొసైటీ అధ్యక్షుడు నకరికంటి బిక్షమయ్య, అంజయ్య, అనంత రాములు, పాలకూరి నరసింహ, పాలకూరి రాములు, యాదయ్య, వెంకన్న పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>