ఉత్కంఠ పోరులో భారత మహిళల జోడీ సంచలన విజయం!

కలం, స్పోర్ట్స్​ : కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games 2026) బౌల్స్ పోటీల్లో భారత మహిళల జోడీ బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో పింకీ సింగ్, రూపా రాణి తిర్కీ ద్వయం మాల్టా జట్టుపై సంచలన విజయం సాధించింది. తొలిసారి ఇండోర్ ఫార్మాట్‌లో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో భారత జోడీ ఆఖరి వరకు పోరాడి గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. రూపా రాణి చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసరగా, పింకీ ఖచ్చితత్వంతో పాయింట్లు సాధించింది. మాల్టాకు చెందిన రిక్సన్ సోదరీమణులు పుంజుకునేందుకు ప్రయత్నించినా భారత్ అవకాశం ఇవ్వలేదు. అద్భుత ప్రదర్శనతో తొలి సెట్‌ను భారత్ 7-1 తేడాతో సునాయాసంగా గెలుచుకుంది.

రెండో సెట్‌లో మాల్టా జట్టు గట్టి పోటీ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో మాల్టా ఆటగాళ్లు పాయింట్లు సాధిస్తూ ఒత్తిడి పెంచారు. దాంతో రెండో సెట్‌ను సమం చేసిన మాల్టా, మ్యాచ్‌ను టైబ్రేక్‌కు నెట్టింది. విజేతను నిర్ణయించే టైబ్రేక్ అత్యంత ఉత్కంఠగా మారింది. మొదట మాల్టా జట్టే ఆధిక్యంలో కనిపించింది. అయితే ఒత్తిడిలోనూ పింకీ సింగ్ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తన ఆఖరి బౌల్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసి భారత్‌కు ఊహించని విజయాన్ని అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>