కలం డెస్క్ : దేశవ్యాప్తంగా రైల్వే టికెట్ ధరలు (Railway Charges) శుక్రవారం నుంచి పెరగనున్నాయి. ఈ నెల 21న రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు ధరల పెరుగుదల డిసెంబరు 26 నుంచి అమలులోకి రానున్నాయి. సబర్బన్, సీజన్ టికెట్‌లు మాత్రం యధాతంగా కొనసాగనున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, తేజస్, గతిమాన్, హమ్‌సఫర్, అమృత్ భారత్, గరీబ్‌రధ్, యువ ఎక్స్ ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్.. ఇలాంటి అన్ని సర్వీసుల్లో ఆర్డినరీ సెకండ్ క్లాస్ మొదలు స్లీపర్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్ వరకు టికెట్ రేట్లు పెరగనున్నాయి. ఒక్కో కి.మీ.కు ఒక పైసా, 2 పైసల చొప్పున పెంచింది రైల్వే బోర్డు. కనీస దూరం 215 కి.మీ. వరకు రేట్లు పెరగవు. ఆ తర్వాత నుంచి మాత్రం పెరగనున్నాయి. శ్లాబులవారీగా రేట్లను పెంచింది.
216-750 కి.మీ. వరకు రూ. 5, 751-1,250 కి.మీ. వరకు రూ. 10, 1,251-1,750 కి.మీ. వరకు రూ. 15, ఆ పైన రూ. 20 చొప్పున పెరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే పాత ధరలే వర్తిస్తాయని, శుక్రవారం నుంచి రిజర్వేషన్ చేసుకునేవారికి మాత్రం కొత్త ధరల ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు (Railway Board) స్పష్టత ఇచ్చింది. మెయిల్, ఎక్స్ ప్రెస్, శతాబ్ది, రాజధాని, దురంతో, గరీబ్‌రధ్, వందేభారత్, నమో భారత్, అమృత్ భారత్, యువ ఎక్స్ ప్రెస్, హమ్‌సఫర్, జనశతాబ్ది, అంత్యోదయ, తేజస్.. తదితర అన్ని రైలు సర్వీసుల్లో 216 కి.మీ. దూరంకంటే ఎక్కువ ప్రయాణం ఉన్న టికెట్ల ధరలు (Railway Charges) పెరుగుతాయి. స్లీపర్, ఫస్ట్ క్లాస్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్‌కార్ కేటగిరీలకు రూ. 2 చొప్పున పెరగనున్నాయి. అయితే శ్లాబ్‌ల సిస్టమ్‌ను అమలు చేస్తున్నందున కనీసంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ. 20 వరకు టికెట్ ధరలు పెరగనున్నాయి.
Read Also: సీఎం, శ్రీధర్‌బాబుకు మధ్య కుదిరిన సయోధ్య?
Follow Us On: Youtube


