20 ఏళ్ల అవినీతిపై పోరాటం ఆగదు: దిడ్డి ప్రవీణ్ ఫైర్..!

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో:  గత 20 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా R&B శాఖలో పనిచేస్తున్న సంధ్య ఎట్టకేలకు తమ పోరాట ఫలితంగా ఇటీవలే కామారెడ్డికి బదిలీ కావడం జరిగిందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు. అయితే కామారెడ్డికి బదిలీ ఉత్తర్వులు వచ్చి పది రోజులు గడుస్తున్న ఇప్పటికీ సంధ్య మహబూబ్ నగర్ జిల్లా R&B శాఖ నుండి రిలీవ్ కాకుండా తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తుందని ఆరోపించారు. ఆమె కామారెడ్డిలో జాయిన్ కావడం లేదని తెలిపారు.

గురువారం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిడ్డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా R&B శాఖలో తేది. 04-07-2005 న మొట్ట మొదటిసారిగా సంధ్య ఏఈగా ఉద్యోగంలో చేరినప్పటి నుండి నేటివరకు దాదాపు 20 సంవత్సరాలకు పైగా మహబూబ్ నగర్ జిల్లాలో విధులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే ఏఈ నుండి డిప్యూటీ ఈఈగా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) గా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. సంధ్య హయాంలో చేపట్టిన పలు పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని తాము పలు ఫిర్యాదులు చేసినట్లు ఆయన తెలిపారు. ఆమె హయాంలో నిర్మించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉండడంతో.. ఆ బిల్డింగ్ ప్రస్తుతం కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

కామారెడ్డికి బదిలీ అయినా…. ఇప్పటికీ రిలీవ్ కానీ వైనం

రెండు దశాబ్ధాలుగా తాము చేస్తున్న ఉద్యమం ఫలితంగా ఈ నెల 13న తెలంగాణ ప్రభుత్వం సంధ్యను మహబూబ్ నగర్ జిల్లా నుండి కామారెడ్డికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే బదిలీ ఆర్డర్లు వచ్చి 10 రోజులు గడుస్తున్నా, మహబూబ్ నగర్ జిల్లా ఆర్ అండ్ బి శాఖ నుండి ఈఈ బాధ్యతలు వదులుకున్నా సంధ్య.. డిప్యూటీగా నేటికీ రిలీవ్ కావడం లేదని మండిపడ్డారు. కామారెడ్డిలో బాధ్యతలు స్వీకరించకుండా ఆమె తన విధుల పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణి, తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతారు చేస్తున్నట్లు స్పష్టమవుతుందని ఆయన విమర్శించారు.

పది రోజులు గడుస్తున్నా… అధికారిక సిమ్ ఇవ్వలే!

కామారెడ్డికి బదిలీ అయ్యి 10 రోజులు గడుస్తున్న, సంధ్య స్థానంలో ప్రస్తుతం ఆర్ అండ్ బి ఈఈగా దేశ్యా నాయక్ విధుల్లో చేరినప్పటికీ, ప్రభుత్వం ఈఈకు జారీ చేసిన అధికారిక ఫోన్ నెంబర్ 9440818100 ను ఇప్పటికీ సంధ్య తన ఆధీనంలోనే పెట్టుకోవడం ఆమె మోనార్కుల వ్యవహరించడం, ఆమె అహంకారానికి నిదర్శనమని, బదిలీ అయిన ఆమె తీరు మారలేదన్న విషయం మరోసారి స్పష్టం అవుతుందని ప్రవీణ్ ఆరోపించారు. అంతేకాకుండా సంధ్య బదిలీ అయినప్పటికీ కార్యాలయానికి చెందిన పలు ఫైల్స్ ను తన ఆధీనంలోనే పెట్టుకున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని ఆయన తెలిపారు.

కామారెడ్డికి వెళ్లిన, కలకత్తాకు వెళ్లిన…పోరాటం ఆగదు

బదిలీపై సంధ్య కామారెడ్డికి వెళ్లిన, కలకత్తాకు వెళ్లిన తమ న్యాయ పోరాటం ఆగదని, గత 20 సంవత్సరాలుగా జిల్లాలో ఆమె ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్, బైపాస్, కళాభారతి, బాలానగర్, నవాబ్ పేట్ తదితర పనుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>