విద్యార్థులకు అలర్ట్​.. రేపటి పరీక్షలు వాయిదా

కలం, వెబ్​ డెస్క్ : వామపక్షాల బంద్​ పిలుపుతో శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా (Exams Postponed) పడ్డాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయం (Osmania University) ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

కాగా, నీట్​ పరీక్షల లీకేజీ వ్యవహారంతో ఢిల్లీ అట్టుడుకుతోంది. పేపర్​ లీకేజీ కి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan)​ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఇదే డిమాండ్​ తో తెలంగాణలో విద్యాసంస్థలకు వామపక్షాలు బంద్​ కు పిలుపునిచ్చాయి. బంద్​ నేపథ్యంలో ఉస్మానియా పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Read Also: భారత్‌ అల్లర్లపై షర్మిష్ఠ సంచలన జోస్యం.. నెట్టింట జోరుగా చర్చ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>