వికసిత్ భారత్ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే ధన్‌పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: కార్మిక సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని భారతీయ మజ్దూర్ సంఘ్‌ను ప్రారంభించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిజామాబాద్ 2 డిపోలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల గంగాధర్ తిలక్ జయంతిన బీఎంఎస్‌ను స్థాపించారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఉపాధి అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.

రాజకీయ ప్రయోజనాల కంటే కార్మికుల హక్కులు, దేశ ప్రయోజనాలు ముఖ్యమనే సిద్ధాంతంతో పనిచేస్తుందన్నారు. దేశంలో సభ్యత్వం పరంగా అతిపెద్ద కార్మిక సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం సంతోషకరమన్నారు. ప్రధానంగా వికసిత్ భారత్ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని, శ్రమకు గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. దేశానికి రైతు అన్నం పెడితే కార్మికుడు దేశాన్ని నిర్మిస్తాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రావణ్, మఠం పవన్, జ్యోతి మురళి, బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సాయరెడ్డి, శ్రీనివాస్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి కుమార్, ఆర్టీసీ కార్మిక సంఘం ప్రతినిధులు కే.బీ.సింగ్, సరోజ, రాములు పాల్గొన్నారు.

Read Also: కాంగ్రెస్ హయాంలో 53 లీకులు.. ఒక్క మంత్రైనా రిజైన్ చేశారా?: రాంచందర్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>