కలం, వెబ్ డెస్క్ : ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగానే ఈసారి కూడా కైట్ ఫెస్టివల్ (Kite Festival) ను గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించింది. జనవరి 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ ఫెస్టివల్ జరగనున్నది. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్టివల్‌కు సెలబ్రిటీలు, ఐటీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రెండేండ్లుగా హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ చర్యలను తెలియజేసేలా కైట్ ఫెస్టివల్‌కు కొన్ని చెరువులను వేదికగా చేసుకోవాలని సీఎం సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో ఆయన నివాసంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమైన సందర్భంగా ఈ సూచనలు వెలుగులోకి వచ్చాయి. హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ ప్రగతి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్న చెరువులను హైడ్రా విముక్తి చేసి మళ్ళీ వినియోగంలోకి తెచ్చిన సందర్భంగా అక్కడ ఫెస్టివల్ సంబరాలు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
తుమ్మిడికుంట, నల్లచెరువులు దగ్గర :
హైటెక్ సిటీ పరిధిలోని తుమ్మిడికుంటలో జరిగే కైట్ ఫెస్టివల్‌కు (Kite Festival) ఐటీ ప్రముఖులు, ఉద్యోగులను ఆహ్వానించాలని కమిషనర్ రంగనాథ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కూకట్‌పల్లిలోని నల్లచెరువు చెరువు దగ్గర సినిమా ప్రముఖులు, రాజేంద్రనగర్ బురుకుద్ఫిన్ చెరువు దగ్గర క్రీడాకారులతో కైట్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు. జనవరి 11,12,13 తేదీలలో Hyderabad Kite Festival కు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ‘హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ యాక్టివిటీస్’ ఉండాలన్నారు.
Read Also: బోసిపోయిన సెక్రెటేరియట్… సెలెబ్రేషన్ మూడ్‌లోకి ఎంప్లాయీస్
Follow Us On: Youtube


