భువనగిరిలో ఉద్రిక్తత.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం!

కలం, యాదాద్రి భువనగిరి : ఏఐసిసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా నడుమ యాదాద్రి భువనగిరి ( Bhuvanagiri ) జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారించడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జీ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడు మేకల మహేష్,రేగు రమేష్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు బట్ట సందీప్, ఆలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మర్రి రమేష్, పోతున్న సన్నీ, వినయ్, సాయి, మురళి, మసూద్, అసద్, శివ తేజ, కార్తీక్, జలీల్, దుర్గా, అబిద్, వంశీ, చరణ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>