రాహుల్‌పై బీజేపీ నిరసన.. హనుమకొండలో ఉద్రిక్తత

కలం, హనుమకొండ: హనుమకొండలోని (Hanumakonda) అశోక జంక్షన్ (Ashoka Junction) వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన (BJP Protest) చేపట్టి.. “రాహుల్ గాంధీ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో అశోక జంక్షన్ పరిసర ప్రాంతాలలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>