కలం, వెబ్ డెస్క్ : నీట్ లీకేజీపై గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) కేంద్రానికి లేఖ రాశారు. దీక్ష విరమించాలని వివిధ పార్టీల నేతలు, పలువురు తన దీక్ష విరమించాలని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు నిరాహార దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, దీక్ష విరమించేందుకు సిద్దంగా ఉన్నానని కానీ కేంద్రం తన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
షరతులు ఇవే..
నీట్ పేపర్ లీకేజీ వివాదంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను పరిగణలోకి తీసుకోవాలి. ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జవాబుదారితనాన్ని నిర్ధారించడానికి పార్లమెంట్ లో చర్చ జరగాలి ఈ ప్రధాన షరతులతో కూడిన లేఖను వాంగ్ చుక్ కేంద్రానికి పంపించారు.

