మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కలం, నాగర్ కర్నూల్: రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నాగర్ కర్నూలు (Nagarkurnool) జిల్లా కేంద్రంలో అచ్చంపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూచుకుళ్ళ రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ‌ఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం అమానుషమన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఆధ్వర్యంలో..

నాగర్ కర్నూల్ బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కొల్లాపూర్ చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు హేయనీయమని మండిపడ్డారు.

Read Also: బీజేపీ నాయకులను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: శాంతి కుమార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>