తెలుగు పండితులే స్ఫూర్తి ప్రదాతలు: డీఈవో

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉంటుందని పిల్లలు కూడా తెలుగు ఉపాధ్యాయులంటే అమితంగా ఇష్టపడతారని డీఈవో విజయ్ కుమారి (DEO Vijay Kumari) అన్నారు. జిల్లా (Mahabubnagar) కేంద్రంలోని మాడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తెలుగు ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏర్పాటుచేసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య శతజయంతి వేడుకలకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

విద్యార్థులకు భాష పట్ల అభిరుచిని పెంపొందించేందుకు తెలుగు ఉపాధ్యాయులు కృషి చేయాలని తమ బోధనతో విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలవాలని డీఈవో అన్నారు. తాను కూడా తెలుగు భాషపై మమకారంతో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేశానని అది తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. జిల్లా తెలుగు ఉపాధ్యాయులు మరింత స్ఫూర్తివంతంగా పనిచేసే జిల్లాకు గుర్తింపుని తేవాలని పిలుపునిచ్చారు. జిల్లా కవులు రాసిన మహాకవే నమోస్తుతే పుస్తకాన్ని డీఈవో (DEO Vijay Kumari) ఆవిష్కరించారు.

అనంతరం ఉద్యోగ విరమణ పొందనున్న మాడల్ బేసిక్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఏ బాసిత్ వేముల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు పల్లెర్ల రామ్మోహన్ రావు ధర్మపూర్ తెలుగు ఉపాధ్యాయులు ఇరువింటి వెంకటేశ్వర శర్మలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ పండిత పరిషత్ అధ్యక్షులు జగదీష్ గిరిజారమణ శ్రీరాములు మురళీ సురేష్ బాబు గుముడాల చక్రవర్తి గౌడ్ కమలేకర్ శ్యాం ప్రసాద్ లతో పాటు వివిధ పాఠశాల నుంచి శిక్షణ కార్యక్రమానికి హాజరైన తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read Also: తెలంగాణలో పవర్​ కట్​ అనేదే లేదు.. డిప్యూటీ సీఎం భట్టి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>