అర్హులందరికీ ఇందిరమ్మ‌ ఇళ్లు మంజూరు చేస్తాం: మంత్రి వివేక్

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ‌ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek) భరోసా ఇచ్చారు. ఇప్పటికే రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ‌ అపార్ట్ మెంట్లలో ఇళ్లను ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు.

సంగారెడ్డి (Sangareddy) జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమీన్‌పూర్ సర్కిల్ – 47 లో రూ. 16 కోట్ల 53 లక్షలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమీన్‌పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని, అమీన్‌పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయను‌న్నట్లు చెప్పారు.

Read Also: గిగ్ వర్కర్ల సమస్యలు తీర్చాలి.. సర్కార్‌కు కవిత హెచ్చరిక

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>