ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు: ఒకేసారి 15 ప్రాంతాల్లో!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో, ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు (ACB Raids) చేపట్టారు.

ఈ ఆకస్మిక తనిఖీల కోసం ఏసీబీ రంగంలోకి దిగింది. మొత్తం 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు, ఏకకాలంలో 15 విభిన్న ప్రాంతాలలో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ముత్యం వెంకటరమణ ఇల్లు, ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అతని సంపాదనకు, ప్రస్తుతం ఉన్న ఆస్తులకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో, తనిఖీలు పూర్తయిన తర్వాత ఎంత మొత్తంలో అక్రమ ఆస్తులు వెలుగు చూశాయనే పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>