రైతులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ తీపి కబురు

కలం, వలిగొండ : రైతులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam ) తీపి కబురు చెప్పారు. బునాదిగాని కాలువకు ఆగస్టు 10 లోపు నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం సంగెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధర్మరెడ్డిపల్లి కాలువకు నీటిని విడుదల చేయడం జరిగిందని, ఆగస్టు 10 లోపు బునాదిగాని కాలువకు నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

అదేవిధంగా త్వరలోనే భీమ లింగం కాలువను రీ మోడలింగ్ చేస్తామని అన్నారు. వందలాది మంది రైతుల వేలాది ఎకరాల సాగు భూములకు నీటిని అందించడమే కాకుండా భూగర్భ జలాల పెరుగుదలకు పలు చెరువులను కుంటలను నింపే భీమలింగం కాలువ రీ మోడలింగ్ చేసి కాలువ చివరి భూముల వరకు సాగునీటిని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ బత్తిని సహదేవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>