epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్ అణు శక్తికి స్ట్రాటజిక్ బూస్ట్.. ‘K-4’ మిసైల్ టెస్ట్ సక్సెస్.. విశేషాలివే!

కలం డెస్క్: భారత్ తయారు చేసిన బాలెస్టిక్ మిస్సైల్ K-4 సక్సెస్ అయింది. న్యూక్లియర్ పవర్‌తో నడిచే ఈ సబ్‌మరైన్ ఐఎన్ఎస్.. 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా తయారు చేశారు. దీనిని బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ అరిఘాత్ ద్వారా భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరానికి సమీపంలో 6,000 టన్నుల INS అరిఘాత్(INS Arighaat K4) నుండి జరిగిన ఈ ప్రయోగంపై రక్షణ శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు.

అయితే, విశ్వసనీయ వర్గాల మాచారం ప్రకారం.. ఇది సాలిడ్ ఫ్యూయెల్ K-4 మిసైల్, 2 టన్నుల అణు శక్తి గల హెవీ పేలోడ్‌ను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది భారత్‌కి తన అణు ఆయుధ త్రయం (Nuclear Triad)లో సముద్ర భాగాన్ని బలపరచడానికి అత్యంత కీలకమైన మిసైల్‌.

“ఈ ప్రయోగం సాంకేతిక ప్రమాణాలు, మిషన్ లక్ష్యాలను పూర్తిగా తీరుస్తుందా లేదా కొన్ని లోపాలను చూపిందా అన్నది సంపూర్ణ విశ్లేషణ ద్వారా నిర్ణయించబడుతుంది. సబ్‌మరైన్‌ల నుండి లాంచ్ చేసే బాలిస్టిక్ మిసైల్స్ సాధారణంగా పూర్తి ఆపరేషనల్ స్థితికి రాక ముందు అనేక ప్రయోగాలు అవసరం అవుతాయి” అని కొందరు నిపుణులు చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సబ్‌మెర్సిబుల్ పాంటూన్‌ల ద్వారా అనేక ప్రయోగాలు చేసిన తరువాత, K-4 ద్వి-దశల మిసైల్‌ను ఐఎన్ఎస్ అరిఘాత్ నుండి 2024 నవంబర్లో పరీక్షించారు.

ఐఎన్ఎస్ అరిఘాత్(INS Arighaat K4).. భారత్‌కు చెందిన రెండవ న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మరైన్ (SSBN). ఇది న్యూక్లియర్ టిప్పడ్‌ బలాస్టిక్ మిసైళ్లను తీసుకెళ్ళగలదు. ఈ సబ్‌మరైన్‌ను ఆగస్ట్ 29, 2024న కమిషన్ చేశారు. దాని మునుపటి వెర్షన్ INS అరిహంత్, 2018లో పూర్తి స్థాయిలో ఆపరేషనల్ అయ్యింది, ఇది కేవలం 750 కిలోమీటర్ల పరిధి కలిగిన K-15 మిసైళ్ళను మాత్రమే తీసుకెళ్ళగలదు.

భారత్ 2026 మొదటి త్రైమాసికంలో మూడవ SSBN INS అరిధామన్ను, 2027–28లో నాల్గవ SSBNను కమిషన్ చేయనుంది. ఇవి దాదాపు 7,000 టన్నుల బరువున్న, మొదటి రెండు 6,000 టన్నుల SSBNల కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. భవిష్యత్తులో, 13,500 టన్నుల SSBNలను కూడా నిర్మించడానికి ప్రణాళిక ఉంది, వీటిలో 190 MW ప్రెజరైజ్డ్ లైట్-వాటర్ రియాక్టర్లు ఉంటాయి, మొదటి నాలుగు సబ్‌మరైన్‌లలో ఉన్న 83 MW రియాక్టర్లకన్నా ఎక్కువ శక్తి కల్పిస్తాయి.

ప్రస్తుత భారత SSBNలు, ఖచ్చితంగా చూస్తే, అమెరికా, చైనా, రష్యా SSBNల పరిమాణం కంటే సగం కన్నా తక్కువ. K-4 మిసైళ్ళు ఆపరేషనల్‌గా ప్రవేశించిన తర్వాత, 5,000–6,000 కిలోమీటర్ల పరిధి కలిగిన K-5, K-6 మిసైళ్ళు అందువల్ల భారత్ ఈ మూడు అణు స్ర్కవల దేశాలతో (US, రష్యా, చైనా) ఉన్న ఖాళీని కొంత తగ్గించగలదు.

Read Also: ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. నందకుమార్​ ఏం చెప్పారంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>