కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ (Tellapur) మున్సిపాలిటీ పరిధిలో జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఒక మహిళతో పాటు 13 ఏళ్ల బాలుడిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం సదరు వ్యక్తి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాజ్, చంద్రకళ అనే ఇద్దరు వ్యక్తులు ఐదు రోజుల క్రితమే తెల్లాపూర్ (Tellapur)కు వచ్చారు. తామిద్దరం భార్యాభర్తలమని స్థానికులకు పరిచయం చేసుకుని ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరితో పాటు చంద్రకళ కుమారుడు (13) కూడా ఉన్నాడు. అయితే గురువారం శివరాజ్ చంద్రకళను, తర్వాత బాలుడిని హత్య చేశాడు. అనంతరం తన గొంతు కోసుకున్నాడు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కొల్లూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శివరాజ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: కేసీఆర్, రేవంత్ భాషపై ‘సోషల్’ డిబేట్
Follow Us On: X(Twitter)


