కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. నీట్ ఎగ్జామ్ లీకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న రాహుల్ గాంధీని (Rahul Gandhi Arrest) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంట్ దగ్గర నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ.వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గం వద్ద నిరసన చేపట్టారు.
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ గాంధీ ఆందోళనను భగ్నం చేశారు. రాహుల్ సహా కాంగ్రెస్ అగ్ర నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

