కలం డెస్క్ : ఒకరు ప్రస్తుత సీఎం.. ఇంకొకరు మాజీ సీఎం.. వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ బూతులొచ్చు?.. ఎవరు ఎక్స్ పర్ట్?.. బూతుల్లో పోటీ పెడితే ఎవరు నెగ్గుతారు?.. ఒకరిని మించి మరొకరు బూతులు ఎందుకు వాడుతున్నారు?.. రాజకీయ విమర్శలు పక్కకుపోయి వ్యక్తిగతంగా ఎందుకు తిట్టుకుంటున్నారు?.. అసభ్య పదజాలంతో తెలంగాణ సమాజానికి వారు ఏం సందేశం ఇస్తున్నారు?… ఇదీ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య జరుగుతున్న చర్చ. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు. ఒకరు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఇంకొకరు మాజీ సీఎం కేసీఆర్. బూతులకు ఆజ్యం పోసిందే కేసీఆర్ అని రేవంత్ (Revanth Reddy Vs KCR) అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి బూతులు పలకొచ్చునా?.. అంటూ కేసీఆర్ అభిమానులు పరస్పరం కామెంట్లు చేసుకుంటున్నారు.
వివాదం మొదలైంది ఇలా… :
దాదాపు రెండేండ్ల పాటు ఫామ్ హౌజ్‌కు పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి కామెంట్లు చేయడంతో వివాదం మొదలైంది. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడికి కారణమయ్యాయి. మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆయన కామెంట్లపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. సొంత నియౌజకవర్గానికి వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి సైతం తనైదైన శైలిలో కేసీఆర్‌పైనా, కేటీఆర్‌పైనా, హరీశ్‌రావుపైనా వ్యంగాస్త్రాలు విసిరారు. దీనికి కౌంటర్‌గా వారూ స్పందించారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లోని కొన్ని పదాలతో సోషల్ మీడియాలో మరింత వేడి రాజుకుంది. బూతులు తొలుత ఆరంభించింది ఎవరు?.. పేటెంట్ ఎవరిది?.. ఎవరిది పైచేయి?.. ఇలాంటివన్నీ దర్శనమిచ్చాయి. ‘న బూతో’.. తరహాలో తిట్ల పురాణం రోడ్డెక్కింది.
ఉద్యమం సమయంలో కేసీఆర్… :
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ వాడిన భాష, అందులోని తిట్లు రాష్ట్ర ప్రజలకు స్వీయానుభవం. వాటిని బాగానే ఎంజాయ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ఉచ్ఛ దశలో ఉన్న ఆ టైమ్‌లో ప్రజల స్పందన కూడా అంతే తీరులో రిఫ్లెక్ట్ అయింది. కేసీఆర్ ప్రసంగాల్లో సన్నాసి, దద్దమ్మ, వెధవలు, హౌలాగాళ్ళు.. ఇలాంటివి చాలా సాధారణ పదాలుగా మారిపోయాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తొలి టర్ములో కొన్ని కొత్త పదాలు వచ్చి చేరాయి. బీజేపీ నేతలను ఉద్దేశించి కుక్కమూతి పిందె.. మందికి పుట్టిన బిడ్డను కూడ మా బిడ్డే అంటారు.. అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి “ఇట్లాంటి రండగాడు కేంద్రమంత్రి కావాలా?..” అని అన్నారు. దీనికి తోడు లంగగాళ్లు, లుచ్ఛాగాళ్ళు, బుట్టచోర్‌గాళ్ళు, బేవకూఫ్.. ఇలాంటివన్నీ కామన్ అయ్యాయి.
రెండో టర్ములో పెరిగిన అసహనం :
కేసీఆర్ ఏది మాట్లాడినా ప్రజలు ఎంజాయ్ చేస్తారనే భావన బీఆర్ఎస్ నేతల్లో ఏర్పడింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఈలలు వేసే యూత్‌పై ఒకింత ఆగ్రహాన్నే ప్రదర్శించారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 317పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తే ‘ముండ జీవో’ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌పై పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లకు రియాక్షన్‌గా ‘ఏం పీకుతారు.. తోక తొండం తెలుసా.. రమ్మను నా కొడుకుల్ని.. నాలికలు చీరేస్తాం.. కుక్కలు.. బ్రోకర్‌గాళ్ళు..’ ఇలాంటివన్నీ విస్తృతమయ్యాయి. దీనికి కొనసాగింపుగా అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్, హరీశ్‌రావులు సైతం భూమికి మూడడుగులు లేనోడు.. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికిన దొంగ.. కటింగ్ మాస్టర్, ఇంగ్లీష్ తెల్వనోడు..’ అంటూ అనేక రకాలుగా తిట్టడం ప్రారంభించారు.
ముల్లును ముల్లుతోనే… విధానమా? :
కేసీఆర్(KCR) ఏ పదం వాడినా జనం జేజేలు కొట్టారన్న బీఆర్ఎస్ నేతల అభిప్రాయానికి తగ్గట్లుగానే సీఎం రేవంత్‌రెడ్డి సైతం తనదైన శైలిలో కేసీఆర్ (Revanth Reddy Vs KCR) ఫ్యామిలీపై తిట్ల దండకం అందుకున్నారు. కేసీఆర్ స్థాయికి దిగజారదల్చుకోలేదని అంటూనే ‘పేడమూతి బోడి లింగం.. నీ యవ్వ.. నా కొడకా.. హౌల పోరడు.. అంట్లు తోమెటోడివి.. పశులు కాసుకుంటే వద్దన్నమా.. లాగుల తొండలిడిచి కొడతా.. పెగ్గులేసుకునేటోడు..’ ఇలాంటి పదాలు వాడడం మొదలుపెట్టారు. రేవంత్ భాషకు కూడా ప్రజల్లో చప్పట్లు, ఈలలు మామూలైపోయాయి. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీశ్‌రావును తిట్టాలంటే అలాంటి భాష వాడితేనే బెస్ట్ అనే అభిప్రాయంతో బూతులు మొదలుపెట్టారేమో అనే మాటలూ వినిపించాయి. పార్టీల అగ్రనేతలు ఇలాంటి పదాలతో యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నారనే చర్చ ఒక సెక్షన్ ప్రజల్ల మొదలైంది. చివరకు ఇది ఎక్కడకు దారితీస్తుందనేది చర్చనీయాంశమైంది.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కీలక సమావేశం
Follow Us On: Instagram


