epaper
Friday, January 16, 2026
spot_img
epaper

షేక్​ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ నేత పోటీ

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో (Bangladesh) షేక్​ హసీనా నియోజకవర్గం నుంచి ఒక హిందూ నేత (Hindu leader) పోటీ చేయనున్నారు. బంగ్లాలో అల్లర్ల కారణంగా పదవి నుంచి దిగిపోయిన మాజీ ప్రధాని షేక్​ హసీనా (Sheikh Hasina) భారత్​లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహ్మద్​ యూనస్​ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. వచ్చే ఫిబ్రవరిలో దేశ పార్లమెంట్​కు ఎన్నికలు జరిపేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

ఈ క్రమంలో షేక్​ హసీనా (Sheikh Hasina) స్థానమైన గోపాల్​గంజ్​–3(కొటాలీపార–తుంగిపార) ఎంపీ స్థానం నుంచి హిందూ నేత గోబింద చంద్ర ప్రమాణిక్ (Gobinda Chandra Pramanik) స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల సిబ్బంది నుంచి నామినేషన్​ పత్రాలు తీసుకున్నారు. గోబింద చంద్ర ప్రమాణిక్​ న్యాయవాది. అలాగే బంగ్లాలో హిందువుల కోసం పనిచేసే ‘బంగ్లాదేశ్​ జాతీయ హిందూ మొహజాతే’ స్వచ్ఛంద సంస్థకు జనరల్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు.

Read Also: హైదరాబాద్ శివారులో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>