కుప్పకూలిన సొరంగం.. సిక్కింలో ఘోర ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: సిక్కింలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నామ్‌చి జిల్లా సమర్‌డుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన (Sikkim Tunnel Collapse) ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో 27 మంది లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను నామ్‌చి, సింగ్లామ్ జిల్లా ఆసుపత్రులతో పాటు గ్యాంగ్‌టక్‌కు కూడా తరలించారు.

కొండచరియలు విరిగిపడి..

కొండచరియలు విరిగిపడి.. సొరంగంపై పడి ప్రవేశ ద్వారం పూర్తిగా మూసుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాస్ ప్రభావం తగ్గకపోవడంతో సహాయక సిబ్బంది లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వెళ్లినవారికి తల తిప్పడం, స్పృహ కోల్పోతున్నారని అధికారులు వివరించారు.

బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు..

లోపల చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుపా టాంలింగ్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే, సహాయక సిబ్బందిని రంగంలోకి దించి, అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. లోపల చిక్కుకున్న కార్మికులు పటేల్ ఇంజినీరింగ్ సంస్థకు చెందినవారుగా చెప్పారు.

Read Also: లాఠీలతో కొడుతారా?.. రాహుల్ గాంధీ ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>