epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పవన్, మహేష్.. గెలిచేది ఎవరు..?

కలం, వెబ్​ డెస్క్​: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan), సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Mahesh Babu).. ఈ ఇద్దరూ ఒకప్పుడు నువ్వా..? నేనా..? అనేట్టుగా పోటీపడ్డారు. అయితే.. పవర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం.. మహేష్ సినిమాల్లోనే కంటిన్యూ అవుతుండడం తెలిసిందే. మహేష్ సినిమా 2027లో రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్‌ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. అందుచేత ఇద్దరి సినిమాలు పోటీపడే పరిస్థితి లేదు కదా.. మరి.. వీళ్లిద్దరిలో గెలిచేది ఎవరు అనడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే..

మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం రీ రిలీజ్ అనే ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ పోకిరి సినిమాతో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి పాత సినిమాలను సరికత్త హంగులతో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన శివ సినిమాను 4కే అంటూ సరికొత్త టెక్నాలిజీతో కొత్తగా రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో కూడా సందడి చేసింది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు 10 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. దీనిని బట్టి పాత సినిమాలను ఇప్పుడు కొత్తగా చూడడానికి సినీ అభిమానులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థం అవుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. మహేష్‌ బాబు కెరీర్ లో మరచిపోలేని సినిమా మురారి. దీనికి క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఇది అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. మహేష్‌ కెరీర్ లో మరచిపోలేని సినిమాగా నిలిచింది. ఈ సినిమాను ఇప్పుడు డిసెంబర్ 31న రీ రిలీజ్(Re-release) చేస్తున్నారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి జల్సా. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. ఈ సినిమాను కూడా డిసెంబర్ 31నే రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో డిసెంబర్ 31న వస్తున్న మురారి, జల్సా(Murari Vs Jalsa).. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో అయితే.. మహేష్‌ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్స్ వార్ నడుస్తుంది. మరి.. ఏ సినిమా ఎక్కువ వసూలు చేస్తుందో చూడాలి.

Read Also: రాజాసాబ్ ఎలా ఉండబోతుందో తెలుసా?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>