కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆర్మూర్ ఏరియా జనరల్ బాడీ సమావేశం కుమార్ నాయన భవన్ లో పద్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో దివంగత కామ్రేడ్ ఇందిరా, కామ్రేడ్ రమక్క లకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా POW తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి హాజరై మాట్లాడారు.
సనాతన ధర్మం పేరిట మహిళా హక్కుల్ని కాలరాస్తున్నారని ఈ సందర్భంగా గోదావరి అన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం మహిళలకు తైలాలు పెట్టడం ఒక ఆనవాయితీగా మారిందని విమర్శించారు. అందులో భాగంగానే మహిళా బిల్లు ఆమోదించి సంవత్సరాలు గడుస్తున్న అమలుకు నోచుకోలేదని, కాగితాలకే పరిమితం చేయడం అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో ఒకే గొంతుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు అమలు చేయాలని POW డిమాండ్ (POW Demands) చేశారు. డీలిమిటేషన్ కు జనగణనకు ఎలాంటి సంబంధం లేదని ఆమోదించిన చట్టాన్ని అమలు చేయడంలో మీకేం ఇబ్బంది వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలోనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా POW నాయకురాలు సీత్యక్క, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి బి. కిషన్, లక్ష్మక్క, భాగ్య, మానస, జమున, చంద్రక్క, ఇస్తారి జ్యోతి, గౌతమి తదితరులు పాల్గొన్నారు.
Read Also: బరువు తగ్గిస్తానని నమ్మించి.. యువతిపై జిమ్ ట్రైనర్ లైంగికదాడి..!
Follow Us On : WhatsApp

