కలం వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) విగ్రహాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu ), కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) కలిసి ఆవిష్కరించారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రజలకు అంకితం చేశారు. అలాగే వెంకటపాలెం సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకు దగ్గరగా సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో వాజ్‌పేయి స్మృతివనాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


