కలం, వెబ్ డెస్క్: వేడుక ఏదైనా భోజన ప్రియులు చాలామంది బిర్యానీ (Biryani)ని తెగ తినేస్తున్నారు. నోరూరించే ఫుడ్ ఐటమ్స్ ఉన్నా.. బిర్యానీని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా స్విగ్వీ ఆన్‌లైన్ ఆర్డర్లలో బిర్యానీ ఫస్ట్ ప్లస్‌లో నిలిచింది. 93 మిలియన్ బిర్యానీలు భారీగా ఆర్డర్ అయ్యాయి. దీని ప్రకారం నిమిషానికి 194 ఆర్డర్లు లేదా ప్రతి సెకనుకు 3.25 ఆర్డర్లు వచ్చాయి. చికెన్ బిర్యానీ 57.7 మిలియన్ ఆర్డర్లతో అగ్రస్థానంలో ఉంది. 44.2 మిలియన్ ఆర్డర్లతో బర్గర్లు రెండవ స్థానంలో ఉండగా, 40.1 మిలియన్ల ఆర్డర్లతో పిజ్జాలు రెండవ స్థానంలో ఉన్నాయి.
బ్రేక్ ఫాస్ట్‌లో దోస ముందుస్థానంలో ఉంది. ఈ సంవత్సరంలో 26.2 మిలియన్ ఆర్డర్లను నమోదు చేసింది. చికెన్ బర్గర్‌లకు 6.3 మిలియన్ ఆర్డర్లు, వెజ్ బర్గర్లు 4.2 మిలియన్ ఆర్డర్లు నమోదు అయ్యాయి. ఇతర ఫుడ్ (Food ) ఐటమ్స్ పోలిస్తే బిర్యానీ (Biryani) పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మాంసం, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు లాంటి మసాలాలతో వండుతారు. ఈ ప్రత్యేకమైన విధానమే రుచికి కారణం. అందుకే చాలామంది బిర్యానీని తినేందుకు ఇష్టం చూపుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ బిర్యానీ చాలా ఫేమస్.
Read Also: ఆ టైమ్ తర్వాత భోజనం చేస్తున్నారా.. అయితే ఆరోగ్యం మటాష్!
Follow Us On: Sharechat


