కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న వారణాసి (Varanasi) మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక మూవీ 2027 లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది వచ్చే ఏడాదిలో ఆరు నెలల్లో కీలక షూటింగ్ జరుగునుంది. ఆసక్తిర విషయం ఏమిటంటే.. ఈ చిత్రం జపాన్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
IMAX జపాన్ అధికారిక X హ్యాండిల్ వారణాసి రిలీజ్ అప్డేట్ గురించి తెలిపింది. దీంతో వారణాసి (Varanasi) మూవీ జపాన్‌లో విడుదల అవుతుందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అంతకుముందు రాజమౌళి (Rajamouli) చిత్రం RRR ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చినప్పటికీ జపనీస్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పుడు వారణాసిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడంతోపాటు జపాన్‌లో కూడా ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇది భారీ స్థాయిలో ప్రేక్షకులను చేరుకునేందుకు ప్లస్ అవుతుంది. ఇప్పటికే రాజమౌళికి విదేశాల్లో మంచి బ్రాండ్‌గా ఉంది. ఈ క్రేజ్ అత్యధిక కలెక్షన్లను రాబట్టగలదు. అన్నీ సవ్యంగా జరిగితే ఇండియాతోపాటు జపనీస్‌లో ఒకేసారి ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: టాలీవుడ్లో సత్తా చాటిన చిన్న సినిమాలు.. 2025లో వీటిదే హవా
Follow Us On: Instagram


