కలం వెబ్ డెస్క్ : సినీ నటుడు శివాజీ(Shivaji) ఇటీవల ‘దండోరా’ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. స్త్రీల వస్త్రధారణ, హీరోయిన్లపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై ప్రముఖ యాంకర్లు, సింగర్లు, నటీమణులు తీవ్రస్థాయిలో స్పందించారు. చిన్మయి, అనసూయ, పాయల్ రాజ్‌పుత్ వంటి వాళ్లు వీడియోలు చేసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఆయన శివాజీ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. అనసూయ రుణం తీర్చుకుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఎక్స్ వేదికగా స్పందించింది.
అంటే రుణం తీర్చుకోవడానికి మీకు అవకాశం కావాలా అంటూ అనసూయ (Anasuya Bharadwaj) ఎక్స్ వేదికగా శివాజీని ట్యాగ్ చేసి ప్రశ్నించింది. “ఎవరైనా ఆమెను ఎక్కడైనా ఇబ్బంది పెడితే.. నేనూ కూడా ఇది తప్పు అని ఖండించడానికి” అని అన్నారు కదా.. నాకు రెండు విషయాలు అడగాలని ఉంది.. నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు సూచిస్తున్నారా సర్?? మరి ఆ నటిని ఇబ్బంది పెట్టినప్పుడు ఇది తప్పు అని వారిని ఎందుకు ఖండించలేదండి?? బాధితురాలిని అవమానించడమే ఎందుకు సర్??” అంటూ ప్రశ్నలు వేసింది. మరి దీనిపై శివాజీ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
Read Also: రాజమౌళి గ్లోబల్ ప్లాన్.. ఆ కంట్రీలో వారణాసి గ్రాండ్ రిలీజ్!
Follow Us On: Instagram


