కలం, వెబ్ డెస్క్ : నటుడు శివాజీ ఇటీవల మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలకు నటి, ఇన్ ఫ్లూయెన్సర్ రేఖా భోజ్ (Rekha Bhoj ) ఘాటుగా స్పందించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు డ్రెస్సులు వేసుకునే హక్కు ఉంటుందన్నారు. ‘శివాజీ సారీ చెబితే సరిపోదని, తప్పయిందమ్మా అంటూ ప్రాదేయపడాలి. పశ్చాత్తాపం పడేవరకు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూనే ఉంటాం. ఎవరికి కంఫర్ట్ ఉన్న డ్రెస్సులు వాళ్లు వేసుకుంటారు. అది వాళ్ల హక్కు.. అన్నింటికంటే నాకు బికినీలోనే చాలా కంఫర్ట్ ఉంటుంది‘ అని శివాజీకి కౌంటర్ వేశారు.
కాగా, నటుడు శివాజీ దండోరా సినిమాలో హిరోయిన్ల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు తీవ్ర దుమారం లేపడంతో పాటు విమర్శలకు దారి తీశాయి. చిన్మయి, అనసూయ, మంచు మనోజ్, రామ్ గోపాల్ వర్మ, పాయల్ రాజ్ పుత్ వంటి సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే, తీవ్ర దుమారం తరువాత శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను తప్పుడు ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. రెండు అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడానని తెలిపారు. దీనిపై Rekha Bhoj బికినీ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


