epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సెంచరీలతో చెలరేగిన రోకో

కలం, వెబ్​డెస్క్​: దేశవాళీ వన్డే టోర్నీ  విజయ్​ హజారేలో రోకో (Rohit Kohli )సెంచరీలతో ఘనంగా పునరాగమనం చేశారు. తమ తమ జట్లకు ఘన విజయం సాధించిపెట్టారు. భారత జాతీయ జట్టులోని ప్రతి సభ్యుడు విజయ్​ హజారేలో కనీసం రెండు మ్యాచ్​లు కచ్చితంగా ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చాలా ఏళ్ల తరువాత రోహిత్​, కోహ్లీ విజయ్​ హజారేలో ఆడారు. తాము ఎంతటి విలువైన ఆటగాళ్లో చాటి చెబుతూ శతకాలతో చెలరేగి తమ తమ జట్లను గెలిపించారు. అభిమానులకు ఆనందాన్ని, సెలెక్టర్లో నమ్మకాన్ని నింపారు.

16 వేల పరుగులు పూర్తి..:

బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్​లో తొలుత ఆంధ్రప్రదేశ్​ 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఏపీ జట్టులో రికీ భుయ్​ సెంచరీ (122; 105 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్​లు) చేశారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ జట్టు విరాట్​ కోహ్లీ(131; 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్​లు) సెంచరీతో చెలరేగాడు. నితీశ్​ రాణా(77), ప్రియాంశ్​ ఆర్య(74) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో ఢిల్లీ జట్టు 12 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యం చేరుకుంది. ఈ మ్యాచ్​ ద్వారా కోహ్లీ లిస్ట్​–ఎ క్రికెట్​లో 16వేల పరుగులు పూర్తి చేసుకొని, సచిన్​ టెండూల్కర్​ తర్వాత ఆ ఘనత సాధించి రెండో క్రికెటర్​గా నిలిచాడు.

రోహిత్​ రెండో శతకం​..:

జైపూర్​ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్​లో హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ(155; 94 బంతుల్లో 18 ఫోర్లు, 9సిక్స్​లు) భారీ సెంచరీ బాదడంతో ముంబై జట్టు 30.3 ఓవర్లలోనే 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీని 61 బంతుల్లోనే పూర్తిచేసుకున్న రోహిత్​కు 17 ఏళ్ల విజయ్​ హజారే కెరీర్​లో ఇది రెండో సెంచరీ మాత్రమే కావడం విశేషం.

తొలిరోజు రికార్డుల మోత.:

విజయ్​ హజారే ట్రోఫీ తొలి రోజు భారీ స్కోర్లు,  శతకాలు, రికార్డుల మోత మోగింది. ఒకేరోజు 20కి పైగా సెంచరీలు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్​తో మ్యాచ్​లో బిహార్​ చిచ్చర పిడుగు, 14 ఏళ్ల  వైభవ్​ సూర్యవంశీ  36 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. తద్వారా లిస్ట్​ క్రికెట్​లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్​గా రికార్డులకు ఎక్కాడు. సూర్యవంశీ (190; 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్​లు)కి తోడు ఆయుష్​ లోహరుక(116), సకిబుల్​ ఘని(128)  సెంచరీలు చేయడంతో బిహార్​ జట్టు విజయ్​ హజారేలో రికార్డు స్కోరు 574/6  సాధించింది. ఘని సెంచరీ సైతం (32 బంతుల్లో) రికార్డులకెక్కింది. ఒడిశాతో మ్యాచ్​లో సౌరాష్ట్ర ఆటగాడు సాత్విక్​ సమాల్​ డబుల్​ సెంచరీ (212; 169 బంతుల్లో 21 ఫోర్లు, 8సిక్స్​లు) బాదాడు. కాగా, రోకో (Rohit Kohli) ఆడిన మ్యాచ్​లు చూడడానికి అభిమానులు పోటెత్తారు.

హైదరాబాద్​ పరాజయం:

రాజ్​కోట్​ వేదికగా యూపీతో జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్​ 84 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన యూపీ 50 ఓవర్లలో 324/5 పరుగులు చేసింది. అభిషేక్​ గోస్వామి(81), ఆర్యన్​ జుయెల్​(80), ధ్రువ్​ జురెల్​(80), రింకూ సింగ్​(67) అర్ధసెంచరీలు చేశారు. హైదరాబాద్​ బౌలర్లలో అర్ఫాన్​ అహ్మద్​ 2 వికెట్లు తీయగా, నితిన్​ సాయి యాదవ్​, తనయ్​ త్యాగరాజన్​, రక్షణ్​ రెడ్డి తలో వికెట్​ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్​ 43 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. ఓపెనర్​ తన్మయ్​ అగర్వాల్​(53) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్​ బుద్ధి(47), వరుణ్​ గౌడ్​(45), రాహుల్ సింగ్​(32) పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో జీషాన్​ అన్సారీ 4,ప్రశాంత్​ వీర్​ 3, కార్తిక్​ త్యాగి 2 వికెట్లు తీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>