రోడ్డుపై నిలబడటమే శాపమైందా?.. కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య

కలం, మెదక్ బ్యూరో: రోడ్డు పైన నిల్చున్నందుకు జరిగిన చిన్న గొడవ చినికి చినికి హత్యకు దారి తీసిన సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి కంది గ్రామం అంబేద్కర్ కాలనీలో కాశీపురం ఆంజనేయులు తన కారులో వెళ్తుండగా, చక్రి అనే యువకుడు రోడ్డుపై నిలబడ్డాడు. దీంతో “రోడ్డుపై ఇలా ఉంటే కారు ఎలా వెళ్తుంది” అనే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అదే సమయంలో చక్రి తండ్రి బూడిద రమేష్ అక్కడికి వచ్చి “నా కొడుకుతో ఎందుకు గొడవ పడుతున్నావు” అని ప్రశ్నించాడు. దీంతో ఆవేశంతో కాశీపురం ఆంజనేయులు కారుతో ముందుకు వెళ్లి, తిరిగి వచ్చి బూడిద రమేష్‌ను కారుతో బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బూడిద రమేష్‌ను సంగారెడ్డిలోని హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కారుతో ఢీకొట్టిన నిందితుడు కాశీపురం ఆంజనేయులుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>