కలం, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 300 ఇన్నింగ్స్ మార్క్ అందుకున్న ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్, రాహుల్ డ్రవిడ్ సరసన చేరాడు. ఈ ఘనతను అందుకున్న జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ మాత్రమే సాధించారు. కోహ్లీకి ఇది 312వ వన్డే మ్యాచ్ కాగా, ఇప్పటివరకు 14,797 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 61 పరుగుల వద్ద వికెట్ కోల్పోకుండా నిలిచినా, భారత బౌలర్ల ధాటికి 107 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
అయితే జో రూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో ఏడో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించగా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా తన కచ్చితమైన బౌలింగ్‌తో ఒక వికెట్ సాధించి ఇంగ్లండ్ బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగించాడు.

