కలం, కరీంనగర్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ (Eswaramma Yadav )పై కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అఖిల భారత యాదవ మహాసభ (Yadav Mahasabha) కరీంనగర్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో జక్కిడి శివ చరణ్ రెడ్డి (Jakkidi Shiva Charan Reddy)పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
అవమానకర వ్యాఖ్యలు యాదవ సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా ఒక ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్న మహిళపై ఈ విధమైన అసభ్య అవమానపర వ్యాఖ్యలు చేయడం సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యగా తాము భావిస్తున్నామన్నారు. సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన ప్రసాద్, లీగల్ అడ్వైసర్ పోచమల్లు యాదవ్,ట్రస్ట్ ఛైర్మన్ బబ్బూరి కుమార్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి యాదవ్, చర్ల పద్మ యాదవ్, వేణు యాదవ్, కొండ రవి యాదవ్, వేల్పుల కొమురయ్య యాదవ, ఓదెలు యాదవ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, కాల్వ మల్లేశం యాదవ్, జిట్టవేనీ పరుశురాం యాదవ్, రవీందర్ యాదవ్, పుట్టపాక రాజకుమార్ యాదవ్, కుల నాయకులు పాల్గొన్నారు.

